24, జూన్ 2016, శుక్రవారం

ఎదురుచూస్తోంది

తన కక్షలో  తాను , తన ఆర్బిటాల్లో తాను, తన గదిలో  తాను, తిరుగుతున్న ప్రతి ప్రోటాన్ ఏదో ఒక రోజు 

ఎక్కడినుంచో  ఏదో ఒక ఎలక్ట్రాన్, ఏదో ఒక రసాయన క్రియకై  తనను పురికొల్పతూ  ఎక్కడికైనా తనని ఎగిరేసుకు పోతుందని  ఎదురుచూస్తుంది . 

25, మార్చి 2014, మంగళవారం

ఒక ప్రశ్న .......

కావొచ్చు  ఈ శరీరం అంతా మట్టి తొ తయారు అయి ఉండ వచ్చు . మట్టిలో ఉండే అన్నీ మూలకాలు  ఇందులో ఉండవచ్చు .ఇదంతా  భౌతిక మూలకాల ,రసాయన చర్యల సమ్మేళనం కావొచ్చు . సిలికాన్, జింక్, కార్బన్, పాస్ఫరస్, అన్నీ ఉండవచ్చు . కానీ ఇంత  భౌతిక ,రసాయనాలను మాత్రమే చూడగలమా అనేదే ప్రశ్న .

    ఓ అందమైన అమ్మాయి ముందు నుంచి అలా చూస్తూ నవ్వుతూ వెళ్తుంటే , ఆమె గోళ్ళలో  సిలికాన్ని,జడలో జింక్ ని , కను రెప్పల్లో  కార్బన్ ని ,పేదల్లో పాస్పరస్ ని  ,ఆమె నవ్వు వెనకల నైట్రస్ ఆక్సైడ్ని, చూడగలమా  అనేదే  ప్రశ్న, ఆమె కన్నీటిలో  సోడియం క్లోరైడ్ ని  చూడగలమా అనేదే అసలైన ప్రశ్న ..... 

    అందుకే ఇది మట్టిలో  ఉండే అన్నీ మూలకాలు ఇందులో ఉన్నా 
ఇది మట్టి కంటే ఎంతో ఎక్కువ. ఆ ఎక్కువే చైతన్యమ్ ఆ ఎక్కువే జీవితం...